Pushkar Singh Dhami: ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి ప్రమాణస్వీకారం

  • అనూహ్యరీతిలో తీరథ్ సింగ్ రాజీనామా
  • కొత్త సీఎంగా పుష్కర్ సింగ్ ధామి
  • బీజేపీ శాసనసభాపక్షం ఆమోదం
  • ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్
Pushkar Singh Dhami has taken oath as Uttarakhand new CM

ఉత్తరాఖండ్ నూతన సీఎంగా పుష్కర్ సింగ్ ధామి ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. గత ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ అనూహ్య పరిణామాల మధ్య తప్పుకోవడంతో, బీజేపీ శాసనసభాపక్షం నిన్న సమావేశమై ఖతిమా నియోజకవర్గ ఎమ్మెల్యే పుష్కర్ సింగ్ ధామీని శాసన సభా పక్ష నేతగా ఎన్నుకుంది. ఈ క్రమంలో, నేడు జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య... పుష్కర్ సింగ్ తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ ఎమ్మెల్యేలు సత్పాల్ మహారాజ్, హరాక్ సింగ్ రావత్, బన్సీదార్ భగత్, యశ్ పాల్ ఆర్యా, బిషన్ సింగ్, సుబోధ్ ఉన్యాల్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

నాలుగు నెలల వ్యవధిలో ఉత్తరాఖండ్ కు మూడో సీఎం వచ్చారు. గత మార్చిలో త్రివేంద్ర సింగ్ రావత్ తప్పుకోగా, తీరథ్ సింగ్ రావత్ సీఎం అయ్యారు. అయితే, ఆయన ఎంపీ కావడంతో, సీఎంగా కొనసాగాలంటే ఎమ్మెల్యేగా గెలవడం అనివార్యమైంది. ఇప్పట్లో ఎన్నికలు జరిగే పరిస్థితులు లేకపోవడంతో ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పుష్కర్ సింగ్ ధామి సీఎం అయ్యారు. పుష్కర్ సింగ్ ధామి ఖతిమా అసెంబ్లీ స్థానం నుంచి రెండు పర్యాయాలు గెలిచారు.

More Telugu News