ఏపీలో కొత్తగా 3,175 కరోనా కేసులు
- గత 24 గంటల్లో 94,595 కరోనా పరీక్షలు
- తూర్పు గోదావరి జిల్లాలో 662 కేసులు
- అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 59 కేసులు
- రాష్ట్రంలో 29 మంది మృతి
- ఇంకా 35,325 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 19,02,923 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 18,54,754 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 35,325 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 12,844కి పెరిగింది.