Rains: ఏపీకి వర్ష సూచన... మూడు రోజుల పాటు వానలు

Rain forecast for AP
  • కోస్తా జిల్లాల్లో వర్షాలు
  • ఇవాళ, రేపు, ఎల్లుండి ఓ మోస్తరు వానలు
  • రాయలసీమలో తేలికపాటి వర్షాలు
  • ఎల్లుండి దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు!
ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.  ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది. అదే సమయంలో, రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఎల్లుండి దక్షిణ కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని తాజా నివేదికలో తెలిపింది.

విశాఖ జిల్లాకు పిడుగుపాటు హెచ్చరిక


విశాఖ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం పిడుగుల హెచ్చరిక జారీ చేసింది. జిల్లాలోని పాడేరు, చీడికాడ, దేవరాపల్లి, హుకుంపేట, అనంతగిరి, ఎల్.కోట, వేపాడ ప్రాంతాల్లో కాసేపట్లో పిడుగులు పడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. వ్యవసాయ క్షేత్రాల్లోని రైతులు, కూలీలు, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.
Rains
Andhra Pradesh
Forecast
Coastal Districts
Rayalaseema

More Telugu News