బాలీవుడ్ న‌టుడు ఆమిర్ ఖాన్ దంప‌తుల విడాకుల‌పై త‌న‌దైన శైలిలో స్పందించిన రామ్ గోపాల్ వ‌ర్మ‌!

04-07-2021 Sun 14:05
  • ఎలాంటి బాధ లేకుండా విడిపోతున్నారు
  • వారికి లేని బాధ ఈ ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ల‌కి ఎందుకు?
  • వివాహం అనేది మూర్ఖత్వం, అజ్ఞానంతో ముడిపడి ఉంటుంది
  • విడాకులు అనేది మాత్రం జ్ఞానం, తెలివితో ముడిప‌డి ఉన్న విష‌యం
rgv on amir khan divorce

తాము విడాకులు తీసుకుంటున్నట్టు బాలీవుడ్ న‌టుడు ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావ్ దంపతులు సంయుక్త‌ ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. త‌మ‌ 15 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వ‌స్తి ప‌లుకుతున్న‌ట్లు వారు ప్ర‌క‌ట‌న చేయ‌డంతో సామాజిక మాధ్యమాల్లో ఈ అంశ‌మే హాట్ టాపిక్‌గా మారింది. వారిపై చాలా మంది విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. దీనిపై ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ స్పందించారు.

ఆమిర్ ఖాన్ దంప‌తులు ఎలాంటి బాధ లేకుండా విడిపోతున్నార‌ని, వారికి లేని బాధ ఈ ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ల‌కి ఎందుక‌ని ఆయ‌న నిల‌దీశారు. సామాజిక మాధ్య‌మాల్లో వాళ్లను ఎందుకు ట్రోల్ చేస్తున్నారని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇక ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావ్ విడిపోవ‌డంతో భవిష్యత్తులో వారు వ్యక్తిగత జీవితాల్లో ఎంతో సంతోషంగా ఉంటారని అనుకుంటున్నానని ఆయ‌న చెప్పారు.

ఎన్న‌డూలేని విధంగా ఇక‌పై  వారి జీవితాలు మరింత బాగుండాల‌ని ఆశిస్తున్నాన‌ని రామ్ గోపాల్ వ‌ర్మ చెప్పారు. త‌న‌ దృష్టిలో వివాహం చేసుకోవ‌డం కంటే విడాకులు తీసుకున్న‌ప్పుడే అధికంగా సెలబ్రేట్‌ చేసుకోవాలని ఆయ‌న అన్నారు. ఎందుకంటే వివాహం అనేది మూర్ఖత్వమ‌ని, అది అజ్ఞానంతో ముడిపడి ఉంద‌ని అన్నారు. విడాకులు అనేది మాత్రం జ్ఞానం, తెలివితో ముడిప‌డి ఉన్న విష‌య‌మ‌ని చెప్పారు.