Kapu Ramachandra Reddy: రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనయుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆత్మహత్యాయత్నం

Rayadurgam MLA Kapu Ramachandra Reddy son Attempt Suicide
  • బళ్లారి ఎమ్మెల్యే కుమారుడు శ్రవణ్‌రెడ్డితో కలిసి కార్ల షోరూం ప్రారంభం
  • వ్యాపార లావాదేవీల విషయంలో విభేదాలు
  • షోరూంలోనే పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం
  • పెదవి విప్పని రామచంద్రారెడ్డి
రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి కుమారుడు ప్రవీణ్ కుమార్‌రెడ్డి ఆత్మహత్యకు యత్నించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బళ్లారి ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి కుమారుడు శ్రవణ్‌రెడ్డితో కలిసి ప్రవీణ్ కుమార్ ఓ కార్ల షోరూమును ప్రారంభించారు. షోరూంకు సంబంధించిన లెక్కలు చెప్పాలంటూ ఎమ్మెల్యే సోమశేఖర్‌రెడ్డి పలుమార్లు అడగడంతో ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపాయి.

ఇటీవల ఇవి మరింత ఎక్కువ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రవీణ్ కుమార్ షోరూంలోనే ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన స్నేహితులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి ప్రవీణ్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. మరోవైపు, కుమారుడి ఆత్మహత్యాయత్నంపై కాపు రామచంద్రారెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు.


Kapu Ramachandra Reddy
Praveen Kumar Reddy
Suicide Attempt
Rayadurgam

More Telugu News