Telangana: తెలంగాణలో నేడు ఓ మాదిరిగా, రేపు భారీగా వర్షాలు

  • బలహీనపడిన ఉపరితల ద్రోణి
  • పశ్చిమ వైపు నుంచి తెలంగాణవైపు తక్కువ ఎత్తులో గాలులు
  • సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా పగటి ఉష్ణోగ్రతలు
Heavy Rains forecast in telangana tomorrow

తెలంగాణలో నేడు ఓ మాదిరిగా, రేపు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంపై ఉన్న ఉపరితల ద్రోణి బలహీనపడిందని పేర్కొంది. పశ్చిమ, వాయవ్య భారతదేశం నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్టు తెలిపింది. కాగా, శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలోని 44 ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిశాయి.

నల్గొండ జిల్లా చలకుర్తిలో అత్యధికంగా 2.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా,  భద్రాద్రి జిల్లాలోని మల్కారంలో 1.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల వరకు తక్కువగా నమోదైనట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

More Telugu News