Nallari Kishore Kumar: అధికార పక్షం నేతలపై నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు

TDP leader Nallari Kishore Kumar alleges huge land scam in Pileru constituency
  • భూకబ్జాలు జరిగాయన్న కిశోర్
  • ప్రభుత్వ భూములకు లే అవుట్లు వేశారని ఆరోపణ
  • అక్రమంగా విక్రయాలు జరిపారని వ్యాఖ్యలు
  • రూ.400 కోట్ల స్కాం జరిగిందని వెల్లడి
అధికార పక్షం నేతల అండతో వైసీపీ నేతలు భారీ ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడ్డారని టీడీపీ నేత నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి ఆరోపించారు. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ భూములకు లే అవుట్లు వేసి విక్రయిస్తున్నారని, తద్వారా రూ.400 కోట్ల మేర భారీ కుంభకోణం జరిగిందని అన్నారు. ఈ అక్రమాలపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. భూ కబ్జాలకు పాల్పడిన వైసీపీ నేతల వెనుక పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు ఉన్నారని కిశోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా, భూకబ్జాలకు సంబంధించిన సర్వే నెంబర్లు, గ్రామం వివరాలను మీడియాకు అందించారు. త్వరలోనే దీనిపై కోర్టుకు వెళతామని కిశోర్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ భూముల కొనుగోలు చెల్లదని రేపు కోర్టు చెబితే, అది ప్రజలకే నష్టం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Nallari Kishore Kumar
Land Scam
Pileru
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News