Ajwain Leaves: చిలీ నుంచి దిగుమతి చేసుకున్న వాము ఆకులో సాల్మొనెల్లా బ్యాక్టీరియా... రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

  • వాము ఆకు దిగుమతి చేసుకున్న కేయా ఫుడ్స్
  • సాల్మొనెల్లా అనారోగ్యకర బ్యాక్టీరియా అని కేంద్రం వెల్లడి
  • ప్రజల్లో అనారోగ్య పరిణామాలు
  • ఆకును వెనక్కి పంపాలని రాష్ట్రాలకు ఆదేశం
Centre warns states return Ajwain leaves imported from Chile

చిలీ నుంచి దిగుమతి చేసుకున్న వాము ఆకులో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్టు కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. సాల్మొనెల్లా అనారోగ్యకరమైన బ్యాక్టీరియా అని, దీని వల్ల మానవుల్లో తీవ్ర అనారోగ్య పరిణామాలు కలుగుతాయని కేంద్రం హెచ్చరించింది.

చిలీ నుంచి కేయా ఫుడ్స్ అనే సంస్థ పెద్ద ఎత్తున వాము ఆకును దిగుమతి చేసుకుందని, కేయా ఫుడ్స్ నుంచి వాము ఆకును వెనక్కి రప్పించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ ఆదేశాలు జారీ చేసింది. భారతదేశంలో ఎండిన వాము ఆకును వంటలు, కొన్ని రకాలు సంప్రదాయ ఔషధాల తయారీలో వినియోగిస్తారు.

More Telugu News