Cricket: ఇంగ్లండ్​ టూర్​ ​కు పృథ్వీ షా.. గిల్​ కు బ్యాకప్​ గా పంపేందుకు బీసీసీఐ యోచన!

  • ఐదు రోజులుగా కసరత్తులు
  • ఓపెనర్ స్థానానికి పరిశీలన
  • కాలి గాయంతో శుభ్ మన్ గిల్ సిరీస్ కు అనుమానమే
  • ఆగస్టు 4 నుంచి 5 టెస్టుల సిరీస్
Prithvi Shaw may get a call to England

న్యూజిలాండ్ తో వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ తర్వాత ఇంగ్లండ్ తో భారత్ తలపడనుంది. ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆగస్టు 4 నుంచి మొదలుకానుంది. అయితే, అంతకుముందే టీమిండియాకు గట్టి దెబ్బ తగిలింది. ఎడమ కాలి గాయం కారణంగా ఓపెనర్ శుభ్ మన్ గిల్ సిరీస్ కు దూరం కావాల్సి వస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా.. పూర్తి సిరీస్ కు అతడు అందుబాటులో ఉండడని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న పృథ్వీ షాను ఇంగ్లండ్ కు పంపించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. బ్యాకప్ గా మయాంక్ అగర్వాల్ ఉన్నా.. ఒకవేళ మయాంక్ కు గానీ, రోహిత్ కు గానీ గాయాలైతే పరిస్థితేంటన్న దానిపైనే మేనేజ్ మెంట్ సమాలోచనలు చేసిందని చెబుతున్నారు. కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ లు టీమ్ లో ఉన్నా.. వారిని మిడిల్ ఆర్డర్ లో దించాలని భావిస్తోందట. అందుకే ఓపెనర్లకు బ్యాకప్ గా పృథ్వీ షాను పిలుస్తారని అంటున్నారు.  

‘‘పృథ్వీ షా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. కాబట్టి అతడిని ఇంగ్లండ్ కు పంపిస్తే టీమిండియా హాయిగా ఉండొచ్చు. గిల్ కు గాయం కాగా, దీనిపై బీసీసీఐ ఐదు రోజులుగా చర్చిస్తోంది. వాస్తవానికి ఈశ్వరన్ ను జట్టులోకి తీసుకున్నా.. ఎప్పుడో జరిగిన రెండు సీజన్ల క్రితం అతడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. ఇలాంటి పరిస్థితుల్లో పృథ్వీ షానే మంచి ఆప్షన్ అని బీసీసీఐ భావిస్తోంది. పృథ్వీ గురించి టీమ్ కు బాగా తెలుసు.. బాగా అర్థం చేసుకోగలడు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే పృథ్వీ షా ఇంగ్లండ్ కు వెళ్లడం ఖాయం’’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.

More Telugu News