పవన్ - రానా సినిమా టైటిల్ ఖరారైనట్టే!

03-07-2021 Sat 11:26
  • కొంతవరకూ జరిగిన చిత్రీకరణ
  • 11వ తేదీ నుంచి నెక్స్ట్ షెడ్యూల్
  • పరిశీలనలో 'పరశురామ కృష్ణమూర్తి' టైటిల్ 
  • నాయికలుగా నిత్యామీనన్ .. ఐశ్వర్య రాజేశ్   
Telugu title is confirmed for Ayyappanum Koshiyum remake movie

పవన్ కల్యాణ్ .. రానా కథానాయకులుగా 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమా రూపొందుతోంది. కొంతవరకూ షూటింగు జరిగిన తరువాత కరోనా ఉద్ధృతి పెరగడంతో షూటింగును ఆపేశారు. మళ్లీ ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గుతుండడంతో, ఈ నెల 11వ తేదీ నుంచి సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. తాజాగా ఈ సినిమాకి ఒక  టైటిల్ ను పరిశీలిస్తునట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది.

ఈ సినిమాలో పవన్ - రానా ఇద్దరి పాతలు ప్రధానమైనవే. రెండు పాత్రలకి సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. మలయాళంలో ఈ రెండు పాత్రల పేర్లను కలిపే టైటిల్ పెట్టారు. అదే పద్ధతిని తెలుగు రీమేక్ లోను పాటించనున్నారు. అలా ఈ సినిమాకి 'పరశురామ కృష్ణమూర్తి' అనే టైటిల్ ను సెట్ చేయాలనుకుంటున్నారట. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో, నిత్యామీనన్ .. ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా కనిపించనున్నారు.