Corona Virus: కొవాగ్జిన్ సమర్థత 77.8 శాతం.. ప్రకటించిన భారత్ బయోటెక్

  • వచ్చేసిన కొవాగ్జిన్ మూడో దశ ప్రయోగ ఫలితాలు
  • తీవ్ర లక్షణాలున్న వారిపై 77.8 శాతం సమర్థత
  • డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం ప్రభావం చూపుతున్న వ్యాక్సిన్
Covaxin Over 77 percent Effective Says Bharat Biotech as it Concludes Final Analysis for Efficacy

కరోనా వైరస్‌పై కొవాగ్జిన్ సమర్థత వెల్లడైంది. కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలను భారత్ బయోటెక్ ప్రకటించింది. కరోనాపై మొత్తంగా 77.8 శాతం సమర్థతతో వ్యాక్సిన్ పనిచేస్తున్నట్టు పేర్కొంది. లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిలో 93.4 శాతం, డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం ప్రభావం చూపుతున్నట్టు ఆ సంస్థ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. కరోనా సంక్రమణ కారణంగా తలెత్తే తీవ్ర లక్షణాలను కొవాగ్జిన్ అడ్డుకుంటుందని, ఫలితంగా ఆసుపత్రిలో చేరే అవసరాన్ని తగ్గిస్తుందని డాక్టర్ కృష్ణ ఎల్లా వివరించారు.

More Telugu News