సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

03-07-2021 Sat 07:38
  • కాజల్ పై ప్రచారంలో వాస్తవం లేదట  
  • 16 నుంచి షూటింగుకి మహేశ్ బాబు 
  • 'ఆహా' చేతిలో మూడు కొత్త సినిమాలు
Kajal not pregnant says sources
*  కథానాయిక కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలను ఆమె సన్నిహితులు ఖండించారు. ఇటీవల కాజల్ సినిమాలు తగ్గించుకుంటుండడంతో ఆమె గర్భవతిఅనీ, అందుకే కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదంటూ ప్రచారం జరిగింది. అయితే, ఇందులో వాస్తవం లేదనీ, అలాంటిదేమీ లేదనీ కాజల్ సన్నిహితులు పేర్కొన్నారు.
*  మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సర్కారువారి పాట' చిత్రం తాజా షెడ్యూలు షూటింగును త్వరలో హైదరాబాదులో ప్రారంభిస్తున్నారు. ఇక మహేశ్ ఈ చిత్రం షూటింగులో ఈ నెల 16న జాయిన్ అవుతాడని తెలుస్తోంది.
*  ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ 'ఆహా' తాజాగా మూడు సినిమాల స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. నాగ చైతన్య, సాయిపల్లవి కలసి నటించిన 'లవ్ స్టోరీ', అఖిల్, పూజ హెగ్డే జంటగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్', నాగశౌర్య నటిస్తున్న 'లక్ష్య' చిత్రాల డిజిటల్ హక్కులను ఆహా పొందింది. ఈ సినిమాలు థియేటర్లలో రిలీజైన తర్వాత ఆహాలో స్ట్రీమ్ చేస్తారు.