Spiders: పార్శిల్ విప్పి చూస్తే అన్నీ బతికిన సాలీళ్లే... ఆశ్చర్యపోయిన అధికారులు!

  • పోలెండ్ దేశం నుంచి పార్శిల్
  • చెన్నై ఫారెన్ పోస్ట్ ఆఫీస్ కు చేరుకున్న వైనం
  • పార్శిల్ లో 107 సాలీళ్లు
  • ప్లాస్టిక్ కంటైనర్లలో సాలీళ్లు
Live spiders inside a parcel

చెన్నై ఎయిర్ పోర్టులోని ఫారెన్ పోస్ట్ ఆఫీసుకు వచ్చిన ఓ పార్శిల్ కస్టమ్స్ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. పోలెండ్ దేశం నుంచి వచ్చిన ఆ పార్శిల్ అనుమానాస్పదంగా ఉండడంతో అధికారులు దాన్ని విప్పి చూశారు. అందులో 107 బతికిన సాలీడు పురుగులు ఉండడం చూసి వారు విస్మయానికి గురయ్యారు. తమిళనాడులోని అరుప్పుకోట్టయ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి పేరిట ఈ పార్శిల్ వచ్చినట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఓ థర్మల్ బాక్సులో అమర్చిన కొన్ని ప్లాస్టిక్ కంటైనర్లలో ఈ సాలీళ్లను బంధించి పోలెండ్ నుంచి పార్శిల్ ద్వారా పంపారు.

కాగా, ఇవి దక్షిణ, మధ్య అమెరికా, మెక్సికో ప్రాంతాలలో కనిపించే ఫోనోపెల్మా, బ్రాకీపెల్మా జాతి సాలీడు పురుగులు అని వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ), జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు గుర్తించారు. అయితే, భారత్ లో ఇలాంటి జీవుల రవాణాకు అనుమతి లేదని, దాంతో ఎక్కడి నుంచి పార్శిల్ వచ్చిందో ఆ చిరునామాకే తిప్పి పంపాలని అధికారులు నిర్ణయించారు.

More Telugu News