హైలైట్ గా నిలవనున్న పవన్ .. రానా యాక్షన్ ఎపిసోడ్!

02-07-2021 Fri 19:40
  • మలయాళ రీమేక్ లో పవన్ - రానా 
  • 40 శాతం చిత్రీకరణ పూర్తి 
  • ఈ నెల 11 నుంచి మేజర్ షెడ్యూల్
  • ఆగస్టు చివరికి పూర్తి చేసే ఆలోచన
 Action episode highlight in Ayyappanum Koshiyum movie remake

ప్రస్తుతం పవన్ సినిమాలు రెండు సెట్స్ పై ఉన్నాయి. ఒకటి క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'హరిహర వీరమల్లు' అయితే, మరొకటి సాగర్ కె చంద్ర రూపొందిస్తున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' మలయాళ రీమేక్. ఈ రీమేక్ షూటింగును ఆల్రెడీ 40 శాతం పూర్తిచేశారు. మిగతా భాగం షూటింగు కోసం ఈ నెల 11వ తేదీ నుంచి సెట్స్ పైకి వెళుతున్నారు. ఆగస్టు చివరినాటికి మొత్తం షూటింగు పార్టును పూర్తి చేస్తారట. అందుకు సంబంధించిన హోమ్ వర్క్ ను గట్టిగానే చేసి రంగంలోకి దిగుతున్నారని అంటున్నారు.

హైదరాబాద్ .. అల్యూమినియం ఫ్యాక్టరీలో పోలీస్ స్టేషన్ సెట్ వేశారట. ఈ సెట్ లో పవన్ .. రానా కాంబినేషన్లో యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మొత్తం నాలుగు యాక్షన్ ఎపిసోడ్స్ ఉండగా, ఇంటర్వెల్ కి ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. పవన్ సరసన నిత్యామీనన్ .. రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.