Vellampalli Srinivasa Rao: కేశినేని నానికి మతి భ్రమించింది.. ఆయన ఎంపీగా ఉండటం దౌర్భాగ్యం: ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

Kesineni Nani lost mental balance says Vellampalli Srinivas
  • జగన్ ను విమర్శించే స్థాయి కేశినేని నానికి లేదు
  • విజయవాడ అభివృద్ధిని టీడీపీ నేతలు పట్టించుకోలేదు
  • కృష్ణలంక ప్రజల కోసం ప్రభుత్వం రిటర్నింగ్ వాల్ నిర్మిస్తోంది
టీడీపీ ఎంపీ కేశినేని నానికి మతి భ్రమించిందని, ఆయనను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేశినేని నాని ఎంపీగా ఉండటం దౌర్భాగ్యమని అన్నారు. తెలుగుదేశం పాలనలో దేవాలయాలను కూల్చి, బాత్రూమ్ లను కట్టించారని మండిపడ్డారు. జగన్ మాత్రం ప్రజల ఆరోగ్యం పట్ల పూర్థి స్థాయిలో దృష్టి సారించారని అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ ను విమర్శించే స్థాయి కేశినేని నానికి లేదని చెప్పారు. విజయవాడ అభివృద్ధిని టీడీపీ నేతలు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కృష్ణలంక ప్రజలకు ఇబ్బంది కలగకుండా తమ ప్రభుత్వం రిటర్నింగ్ వాల్ నిర్మిస్తోందని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు ఆయన ఆనందయ్య మందును పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
Vellampalli Srinivasa Rao
Jagan
YSRCP
Kesineni Nani
Telugudesam

More Telugu News