Renuka Chowdary: కేసీఆర్ పై దండయాత్ర ఖమ్మం నుంచే ప్రారంభమవుతుంది: రేణుకా చౌదరి

KCR downfall starts from Khammam says Renuka Chowdary
  • కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి
  • మోదీకి కుటుంబ బాధ్యతలు తెలియవు
  • కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన నేతలు మళ్లీ సొంత గూటికి చేరుకుంటారు
తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీలపై కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి మండిపడ్డారు. కేసీఆర్ పై ఖమ్మం జిల్లా నుంచే తిరుగుబాటు ప్రారంభమవుతుందని ఆమె అన్నారు. కేసీఆర్ పై దండయాత్ర ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని దుయ్యబట్టారు.

చైనా కవ్వింపులకు పాల్పడుతున్నా మోదీ మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. మోదీకి కుటుంబ బాధ్యతలు తెలియవని... తెలిసుంటే ధరల పెరుగుదలతో కుటుంబాలు పడుతున్న ఇబ్బంది ఆయనకు అర్థమయ్యేదని అన్నారు. ఇతర పార్టీలకు వెళ్లిన నేతలందరూ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకుంటారని రేణుక చెప్పారు.
Renuka Chowdary
Congress
KCR
TRS
Narendra Modi
BJP

More Telugu News