Huge Sound: పెద్ద శబ్దంతో ఉలిక్కిపడిన బెంగళూరు నగరం

Huge sound creates panic in South Bengaluru
  • బెంగళూరు సౌత్ లో భారీ శబ్దం
  • ఇళ్ల అద్దాలు ధ్వంసం
  • పరుగులు తీసిన ప్రజలు
  • గతేడాది కూడా ఇలాంటి శబ్దం
గతేడాది వేసవిలో బెంగళూరు నగరంలో భారీ శబ్దాలు ప్రజలను హడలెత్తించాయి. నేడు కూడా అలాంటి పెద్ద శబ్దాలే మరోసారి ప్రజలను భయకంపితులను చేశాయి. బెంగళూరు సౌత్ లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ శబ్దం ధాటికి పలు భవనాల్లో అద్దాలు భళ్లున పగిలిపోయాయి. బొమ్మనహళ్లి, సిల్క్ బోర్డు, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, పద్మనాభ నగర్, మహదేవపుర వంటి ప్రాంతాల్లో ఈ పెను శబ్దం వినిపించింది.

అప్పట్లో ఇలాంటి శబ్దమే వినిపించగా, యుద్ధ విమానాలు సృష్టించే సోనిక్ బూమ్ అని భావించారు. అది తమ సూపర్ సోనిక్ విమానం నుంచి వచ్చిన ధ్వని అని భారత వాయుసేన వెల్లడించింది.

తాజాగా ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ భారీ శబ్దం వినిపించగా, ప్రజలు ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. అయితే, ఈసారి వచ్చిన శబ్దంపై బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) స్పందిస్తూ, అందుకు తమ విమానాలు కారణం కాదని స్పష్టం చేసింది.
Huge Sound
Bengaluru
South
Panic
Sonic Boom

More Telugu News