Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా 'ఎవరు మీలో కోటీశ్వరులు' రియాల్టీ షో

Jr NTR hosts Evaru Meelo Koteeswarulu game show
  • గతంలో బిగ్ బాస్ షోతో అదరగొట్టిన ఎన్టీఆర్
  • ఈసారి రియాలిటీ గేమ్ షోతో వస్తున్న వైనం
  • జులై 7 నుంచి షూటింగ్
  • వచ్చే నెల నుంచి జెమిని టీవీలో షో ప్రసారం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు బుల్లితెర కొత్త కాదు. ఆయన గతంలో 'బిగ్ బాస్' వంటి అతిపెద్ద రియాల్టీ షో మొదటి సీజన్ ను విజయవంతంగా నడిపి ఖ్యాతి పొందారు. తాజాగా ఆయన 'ఎవరు మీలో కోటీశ్వరులు' అనే రియాల్టీ గేమ్ షోతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో ఎపిసోడ్ల కోసం జులై 7 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.  ఈ చిత్రీకరణలో ఎన్టీఆర్ కూడా పాల్గొంటున్నారు. హైదరాబాదు అన్నపూర్ణ స్టూడియోస్ లో దీనికోసం ప్రత్యేకంగా సెట్ వేశారు. కొన్ని ఎపిసోడ్ల చిత్రీకరణ అనంతరం వచ్చే నెల నుంచి ఈ కార్యక్రమంలో జెమిని టీవీ చానల్లో ప్రసారం కానుంది.

వాస్తవానికి ఈ షో ముందే ప్రారంభం కావాల్సి ఉన్నా కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కొవిడ్ కేసులు బాగా తగ్గడంతో షోకి ఆటంకాలు తొలగిపోయాయి.
Jr NTR
Evaru Meelo Koteeswarulu
Reality Game Show
Jemini TV
Tollywood
Telangana
Andhra Pradesh

More Telugu News