Yami Gautam: యామీ గౌతమ్​ కు మరోసారి ఈడీ నోటీసులు

Yami For the second time summoned by ED in Money Laundering Case
  • మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించిందని కేసు
  • విచారణకు హాజరు కావాలన్న ఈడీ
  • రెండోసారి నోటీసులిచ్చిన అధికారులు
బాలీవుడ్ నటి యామీ గౌతమ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులిచ్చింది. మనీ లాండరింగ్ చట్టాన్ని (ఫారిన్ ఎక్స్ చేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ – ఫెమా) ఉల్లంఘించిన కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ తాఖీదులిచ్చింది. దీంతో రెండోసారి ఆమెకు ఈడీ నోటీసులిచ్చినట్టయింది. ఆ కేసును జోన్ 2 అధికారులు విచారిస్తున్నారు. బాలీవుడ్ పెద్ద నిర్మాణ సంస్థలపై ఇప్పటికే ఈడీ నిఘా పెట్టింది. విదేశీ లావాదేవీలపై ఓ కన్నేసి పెట్టింది.

కాగా, ఇటీవలే బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘ఉడీ’ దర్శకుడు ఆదిత్య ధర్ ను యామీ వివాహం చేసుకుంది. విక్కీ డోనర్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రస్తుతం.. ‘ఎ థర్స్ డే’ అనే థ్రిల్లర్ మూవీని చేస్తోంది. షూటింగ్ లో బిజీగా ఉంది. హృతిక్ హీరోగా రూపొందిన కాబిల్, వరుణ్ ధావన్ బద్లాపూర్ లలోనూ ఆమె మెరిసింది.
Yami Gautam
Enforcement Directorate
Money Laundering
FEMA

More Telugu News