భారత్ సహా 14 దేశాలకు తమ దేశ ప్రజల ప్రయాణాలపై యూఏఈ నిషేధం
- కరోనా కేసుల నేపథ్యంలో యూఏఈ కీలక నిర్ణయం
- జులై 21 వరకు 14 దేశాలకు ప్రయాణాలపై నిషేధం
- కార్గో, చార్టర్డ్ విమానాలకు మాత్రం అనుమతి
భారత్ సహా 14 దేశాలకు తమ దేశ ప్రజల ప్రయాణాలపై యూఏఈ నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ఈ జాబితాలో భారత్ తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ తదితర దేశాలు ఉన్నాయి. జులై 21 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని, ఆయా దేశాలకు తమ ప్రజలు ప్రయాణాలు పెట్టుకోకూడదని యూఏఈ తెలిపింది. కరోనా నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఏఈ సివిల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది. అయితే ఛార్టర్డ్, కార్గో విమానాలకు ఈ నిషేధం వర్తించదని తెలిపింది.