Corona Virus: మెడికల్ లీవులు, బీమా డబ్బుల కోసం... నమూనాలు మార్చి కరోనా లేకున్నా పాజిటివ్!

Ward Boy Arrested for Changing Corona Testing Swabs
  • మహారాష్ట్రలో ఖామగావ్ ఆసుపత్రిలో ఘటన
  • ఆసుపత్రిలో వార్డ్ బాయ్ కేంద్రంగా దందా
  • నమూనాలు ఇచ్చిన వారి పేర్లు మార్చిన వైనం
ప్రైవేటు కంపెనీల్లోని ఉద్యోగులు తప్పుడు కరోనా రిపోర్టులు తీసుకుని, మెడికల్ లీవులు, ఇన్స్యూరెన్స్ క్లయిమ్ లు చేసుకునేందుకు సహకరిస్తున్న ఓ రాకెట్ ను పోలీసులు ఛేదించారు. మహారాష్ట్రలోని ఖామగావ్ ఆసుపత్రిలోని ఓ వార్డు బాయ్ ని అరెస్ట్ చేసి విచారించగా మొత్తం దందా వెలుగులోకి వచ్చింది. ఇక్కడి జనరల్ ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న విజయ్ రఖాండే, కరోనా పాజిటివ్ ఉన్న నమూనాలను వైరస్ సోకని వారి పేరిట మారుస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నీలేష్ తాప్రే కనిపెట్టి పోలీసులకు సమాచారం అందించారని అన్నారు.

కొన్ని ప్రైవేటు కంపెనీల్లోని ఉద్యోగులకు ఇందులో భాగం ఉందని, వారికి నమూనాలు మారుతున్న విషయం ముందుగానే తెలుసునని, వారు తమకు సెలవులు, బీమా డబ్బుల కోసం తప్పుడు రిపోర్టులు తెచ్చుకున్నారని పోలీసులు తేల్చారు. నిందితుడు టెస్టింగ్ ల్యాబ్ లలోకి వెళ్లి, నమూనాలను మార్చేవాడని, ఇందుకోసం డబ్బులు కూడా తీసుకున్నారని అధికారులు వెల్లడించారు.
Corona Virus
Swabs
Positive
Maharashtra

More Telugu News