Pooja Hegde: విజయ్ తో చిందేస్తున్న పూజ హెగ్డే!

Pooja Hegde shakes a leg with Vijay
  • తెలుగు, హిందీ సినిమాలతో పూజ బిజీ 
  • తమిళంలో విజయ్ తో 'బీస్ట్' సినిమా
  • నేటి నుంచి ఇద్దరిపైనా పాట చిత్రీకరణ
  • ఇరవై రోజుల పాటు జరిగే షెడ్యూలు  
టాలీవుడ్ లో ఈవేళ టాప్ హీరోయిన్లలో పూజ హెగ్డే ఒకరు. స్టార్ హీరోల సినిమాల నుంచి ఆమెకున్న డిమాండ్ మామూలు డిమాండ్ కాదు. పారితోషికం ఎంతైనా సరే.. ఆమె డేట్స్ ఇస్తే చాలనుకునే నిర్మాతలు చాలా మందే వున్నారు. అయితే, ఈ ముద్దుగుమ్మ ఇటు తెలుగులో నటిస్తూనే.. అటు హిందీ సినిమాలు కూడా చేస్తోంది. దాంతో ఆమె డేట్స్ అంత ఈజీగా దొరకడం కష్టమనే చెప్పాలి. ఇప్పటికే తెలుగులో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్', 'రాధేశ్యామ్' చిత్రాలను పూర్తిచేసి, 'ఆచార్య'లో చరణ్ సరసన నటిస్తోంది. మరోపక్క హిందీలో 'సర్కస్', 'బైజాన్' సినిమాలు చేస్తోంది.

ఈ క్రమంలో ఇటీవలే తమిళంలో కూడా ఓ భారీ చిత్రానికి కమిట్ అయింది. స్టార్ హీరో విజయ్ కథానాయకుడుగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పేరు 'బీస్ట్'. ఇప్పటికే ఓ షెడ్యూలును పూర్తిచేసుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూలు ఈ రోజు చెన్నైలో మొదలైంది. ఇందుకోసం పూజ నిన్న రాత్రే హైదరాబాదు నుంచి చెన్నైకి చేరుకుంది.

నేటి నుంచి విజయ్, పూజ జంటపై గోకులం స్టూడియోలో వేసిన భారీ సెట్స్ లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ నిర్వహిస్తున్నాడు. ఈ షెడ్యూలును ఇరవై రోజుల పాటు నిర్వహించడానికి ప్లాన్ చేశారు. ఇక 'బీస్ట్' తొలి షెడ్యూలు ఆమధ్య జార్జియాలో జరిగింది. ఆ షెడ్యూలులో పూజ పాల్గొనలేదు. ఇప్పుడు ఎకాఎకీన పాట చిత్రీకరణతో ఈ షూటింగులో జాయిన్ అయిందన్నమాట!
Pooja Hegde
Vijay
Nelson Dileep
Bhaijaan

More Telugu News