Telangana: తెలంగాణకు వర్ష సూచన

  • బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి
  • రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
  • రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల భారీ వర్షాలు
Rain Forecast for Telangana

బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఏపీ, పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 4.5 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల వరకు ద్రోణి ఆవరించి ఉంది. ఈ ద్రోణి నేపథ్యంలో రాగల మూడు రోజుల్లో ఇరు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణ విషయానికి వస్తే... ఈరోజు నైరుతి, తూర్పు, దక్షిణ జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షం పడే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

More Telugu News