COVID19: భారత్​ హెచ్చరికలతో దిగొచ్చిన ఈయూ దేశాలు!

  • కొవిషీల్డ్ కు 7 దేశాల ఆమోదం
  • ఆ వ్యాక్సిన్ కూ జాబితాలో చోటు
  • లిస్ట్ లో లేని టీకాలేసుకుంటే క్వారంటైన్ తప్పనిసరి
7 EU Nations Accept Covishield

భారత్ హెచ్చరికలతో కొన్ని యూరోపియన్ దేశాలు దిగొచ్చాయి. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు వేసుకున్న భారతీయులను ఈయూ (యూరోపియన్ యూనియన్/ఐరోపా కూటమి) దేశాలు అనుమతించని సంగతి తెలిసిందే. ఆ రెండు వ్యాక్సిన్ల సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోబోమని ఆ దేశాలు తేల్చి చెప్పాయి. ఈ నేపథ్యంలోనే కొవిషీల్డ్, కొవాగ్జిన్ లను ఆమోదించే జాబితాలో చేర్చకుంటే.. ‘మేం కూడా మీ వ్యాక్సిన్ సర్టిఫికెట్లను ఆమోదంచబోం’ అని భారత్ హెచ్చరించింది.

ఆ వార్నింగ్ తో కొన్ని ఈయూ దేశాలు దిగొచ్చాయి. ఏడు దేశాలు కొవిషీల్డ్ కు ఆమోదం తెలిపాయి. ఆస్ట్రియా, జర్మనీ, స్లొవేనియా, గ్రీస్, ఐస్ లాండ్, ఐర్లాండ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ లు కొవిషీల్డ్ వ్యాక్సిన్ కు అనుమతినిచ్చాయి. వాస్తవానికి ఈయూ కూటమి ఫైజర్ కొమిర్నాటి, మోడర్నా, ఆస్ట్రాజెనికా వ్యాక్స్ జెవ్రియా (భారత్ లో కొవిషీల్డ్.. కానీ, ఈయూ ఆమోదించలేదు), జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలు వేసుకున్న వారికే ఈయూ దేశాలు అనుమతినిచ్చాయి.

అయితే, సభ్య దేశాలు తమకు తగ్గట్టు నిబంధనలు మార్చుకోవచ్చని ఈయూ స్పష్టం చేసింది. అయినా, ఏ దేశమూ కొవిషీల్డ్, కొవాగ్జిన్ లను తమ జాబితాలో చేర్చలేదు. దీంతో ఆ టీకా వేసుకున్న వారంతా తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది.

More Telugu News