Abhimanyu Mishra: అతి చిన్న వయసులో చెస్ గ్రాండ్ మాస్టర్ గా అవతరించిన అభిమన్యు మిశ్రా!

  • భారత సంతతి చిన్నారిగా మిశ్రా
  • 13 ఏళ్లు నిండకుండానే గ్రాండ్ మాస్టర్
  • గత సంవత్సరమే ఇంటర్నేషనల్ మాస్టర్ గా మిశ్రా
Youngest Chess GM is Abhimanyu Mishra

భారత సంతతి అమెరికన్ చిన్నారి అభిమన్యు మిశ్రా, ప్రపంచంలోనే అతి చిన్న వయసులో చెస్ లో గ్రాండ్ మాస్టర్ గా అవతరించాడు. 12 సంవత్సరాల, 4 నెలల 25 రోజుల వయసున్న మిశ్రా, ఇప్పటివరకూ సెర్గీ కర్జాకిన్ పేరిట ఉన్న రికార్డును తుడిపేశాడు.

మూడేళ్ల క్రితం కర్జాకిన్ 12 ఏళ్ల, 7 నెలల వయసులో గ్రాండ్ మాస్టర్ గా అవతరించి, రికార్డును సృష్టించగా, ఇప్పుడది కనుమరుగైంది. ఇదే సమయంలో భారత్ కు చెందిన ఆర్. ప్రజ్ఞానంద త్రుటిలో అభిమన్యును దాటి పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ గా అవతరించే అవకాశాన్ని కోల్పోయాడు. గత సంవత్సరం ఇంటర్నేషనల్ మాస్టర్ గా అవతరించిన అభిమన్యు, ఆపై తాను పాల్గొన్న ప్రతి పోటీలోనూ సత్తా చాటుతూ దూసుకెళ్లాడు.

కరోనా కారణంగా గత సంవత్సరం చాలా టోర్నమెంట్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే, అభిమన్యు లక్ష్యాన్ని బుడాబెస్ట్ గ్రాండ్ మాస్టర్ పోటీలు నెరవేర్చాయి. ఏప్రిల్ నుంచి హంగేరీలో ఉన్న అభిమన్యు, అదే నెలలో తొలి, మేలో రెండో జీఎం నార్మ్స్ పొందాడు. మూడవ జీఎం నార్మ్ కోసం మాత్రం వేచి చూడాల్సి వచ్చింది.

More Telugu News