18 ఏళ్లు దాటిన వారికి హైదరాబాద్‌లో నేటి నుంచి టీకా
- ఇప్పటి వరకు 35 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకా
- నగర వ్యాప్తంగా 100 వ్యాక్సిన్ కేంద్రాలు
- కొవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే టీకా
లబ్ధిదారులు తొలుత కొవిన్ యాప్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. అలా చేసుకున్న వారికే టీకాలు వేస్తామని పేర్కొన్నారు. కొవిన్‌లో పేర్లు నమోదు చేసుకున్న తర్వాత తమ సమీపంలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్లలో టీకా వేయించుకోవచ్చని వివరించారు.