Venkaiah Naidu: జాతీయ ప్రయోజనాలు, ప్రాంతీయ అవసరాలకు తగిన టెక్నాలజీని ఐఐటీలు అభివృద్ది చేయాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • మద్రాస్ ఐఐటీలో వెంకయ్య పర్యటన
  • త్రీడీ ప్రింటింగ్ తో నిర్మితమైన భవనం పరిశీలన
  • సమాజ హితం కోరే టెక్నాలజీ కావాలని పిలుపు
  • ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడానికి సాంకేతికతే ఆలంబనన్న ఉప రాష్ట్రపతి
Vice president Venkaiah Naidu visits IIT Madras campus

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇవాళ మద్రాసు ఐఐటీ ప్రాంగణానికి విచ్చేశారు. త్రీడీ ప్రింటింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమైన భవనాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.... జాతీయ ప్రయోజనాలు, ప్రాంతీయ అవసరాలకు తగిన విధంగా సాంకేతికతను అభివృద్ధి చేయడంపై ఐఐటీలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉన్నత విద్యాసంస్థలు సమాజ హితం కోరి పరిశోధనలు చేపట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. విద్యాసంస్థలు, పరిశ్రమలు సమన్వయంతో ముందుకు కదిలితే దేశంలో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

ముఖ్యంగా, ప్రపంచానికి ప్రబల శత్రువుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడానికి సాంకేతికతే ఆలంబన కావాలని పిలుపునిచ్చారు. తాజాగా టెర్రరిస్టులు డ్రోన్లతోనూ దాడులు నిర్వహిస్తున్నారని, రాడార్లకు దొరకని విధంగా దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. వారికి జవాబు చెప్పగలిగే సాంకేతికతను అభివృద్ధి చేయడాన్ని ఐఐటీలు, దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధన సంస్థలు బాధ్యతగా స్వీకరించాలని ఉద్బోధించారు.

More Telugu News