Corona Virus: జులై-సెప్టెంబరు మధ్య భారత్‌లో మరో కరోనా టీకా!

  • కొవావాక్స్ టీకాను తయారు చేసిన నొవావాక్స్‌
  • భారత్‌లో త్వరలో అందుబాటులోకి వస్తుందన్న సీఈఓ
  • యూకే ట్రయల్స్‌లో 90 శాతం సమర్థత
  • వేరియంట్లపైనా మంచి ప్రభావం
  • డెల్టాపై ప్రభావం తేల్చడానికి మరింత సమాచారం కావాలి
Between july and sept Covavax vaccine will be available for India

అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ నొవావాక్స్‌ రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ కొవావాక్స్ భారత్‌లో జులై-సెప్టెంబరు మధ్య అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆ సంస్థ సీఈఓ స్టాన్లీ ఎర్క్‌ తెలిపారు. ధర కొవిషీల్డ్‌ కంటే కాస్త ఎక్కువే ఉండే అవకాశం ఉందన్నారు.

కొవావాక్స్‌ కరోనా వేరియంట్లపై పనిచేస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. అయితే, ప్రత్యేకంగా డెల్టా వేరియంట్‌పై దీని ప్రభావం ఎంతన్నది చెప్పడానికి మరింత సమాచారం కావాల్సి ఉందన్నారు. యూకేలో నిర్వహించిన మూడో దశ క్లినికల్‌ ప్రయోగాల్లో టీకా అద్భుతంగా పనిచేస్తున్నట్లు తేలిందన్నారు. అమెరికాలో ప్రయోగాలు తుది దశలో ఉన్నాయన్నారు. కొవిడ్‌పై కొవావాక్స్‌ టీకా 90 శాతం సామర్థ్యం చూపిందన్నారు.

More Telugu News