Srinivasananda: దేవాలయాలకు పట్టిన దుస్థితిపై విజయసాయిరెడ్డి ఎందుకు స్పందించరు?: శ్రీనివాసానంద సరస్వతి

  • రాష్ట్ర పరిస్థితులపై శ్రీనివాసానంద స్పందన
  • విశాఖలో మీడియాతో మాట్లాడిన వైనం
  • ఆడియోలు మార్ఫింగ్ చేస్తే చర్యలేవన్న స్వామీజీ
  • ఈవో ఏంచేశారో చెప్పాలంటూ డిమాండ్
Srinivasanada comments on endowment issues

సీఎం జగన్ కుటుంబంలోని వారంతా మత ప్రచారకులేనంటూ గతంలో వ్యాఖ్యలు చేసిన ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి మరోసారి స్పందించారు. ఏపీలో దేవాలయాలకు పట్టిన దుస్థితిపై విజయసాయిరెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ,  సింహాచలంలో గరుడ నారసింహ వార్షికోత్సవంలో ఆడియోలను మార్ఫింగ్ చేస్తే ఏం చేశారని నిలదీశారు. పాలకమండలి నుంచి స్పందన లేదని, ఈవో సూర్యకళ ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రామతీర్థం ఘటనపై 24 గంటల్లో దోషులను పట్టుకుంటామన్నారు... ఏమైంది? గతంలో టీటీడీ వెబ్ సైట్లో ఏసయ్య స్తోత్రాలు చూశామని, ఇలాంటి చర్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. హిందూ సంప్రదాయాలను అవహేళన చేసే ధోరణి మారాలన్నారు.

More Telugu News