Paritala Sunitha: నా పేరుపై ఉన్న పట్టా భూమిని వేరొకరికి మార్చేశారు: పరిటాల సునీత

Former minister Paritala Sunitha fires on revenue officials
  • చెన్నేకొత్తపల్లిలో సునీత మీడియా సమావేశం
  • రెవెన్యూ అధికారులపై ఆగ్రహం
  • ఆన్ లైన్ లో వివరాలు మార్చేస్తున్నారని ఆరోపణ
  • రైతులకు అన్యాయం చేయొద్దని స్పష్టీకరణ
ఏపీ రెవెన్యూ అధికారుల తీరుపై టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరిట ఉన్న భూమిని మరొకరి పేరిట మార్చేశారని సునీత ఆరోపించారు. గతంలో మంత్రిగా పనిచేసిన తనకే ఇలాంటి అనుభవం ఎదురైతే, సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమె మండిపడ్డారు. కనగానపల్లెలో తన పేరు మీద ఉన్న పట్టా భూమిని వేరొకరి పేరు మీద మార్చారని, తన నియోజకవర్గంలోని భూ పట్టాలను, ఆన్ లైన్ వివరాలను తారుమారు చేస్తున్నారని సునీత రెవెన్యూ అధికారులపై ధ్వజమెత్తారు.

అధికార పక్షం ఒత్తిళ్ల నేపథ్యంలో, రెవెన్యూ అధికారులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. అన్ని భూ రికార్డులు సక్రమంగా ఉన్న రైతులకు అన్యాయం చేయవద్దని స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. చెన్నేకొత్తపల్లిలో మీడియాతో మాట్లాడుతూ పరిటాల సునీత ఈ వ్యాఖ్యలు చేశారు.
Paritala Sunitha
Revenue Officials
Land
Online
TDP
Andhra Pradesh

More Telugu News