Nara Lokesh: లక్షల ఉద్యోగాలంటూ, వందల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇచ్చిన జగన్ ను కూడా అరెస్ట్ చేయాలి: నారా లోకేశ్

Nara Lokesh demands CM Jagan arrest over job calendar issue
  • ఇటీవల జాబ్ క్యాలెండర్ విడుదల
  • విజయవాడలో నిరుద్యోగుల నిరసనలు
  • అరెస్ట్ చేసిన పోలీసులు
  • వెంటనే విడుదల చేయాలన్న లోకేశ్
ఏపీ జాబ్ క్యాలెండర్ పై నిరసనలు తెలుపుతున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారంటూ నారా లోకేశ్ వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉద్యోగాలు లేని జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి, వైసీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 2.30 లక్షల ఉద్యోగాలతో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు విజయవాడలో ఆందోళనకు దిగాయని వివరించారు.

అయితే, వారిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని, దీన్ని తాను ఖండిస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు. మోసపోయిన నిరుద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు... లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి, వందల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇచ్చి మోసం చేసిన జగన్ ను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతలను తక్షణమే విడుదల చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

జగన్ స్వామ్య వ్యవస్థలతో తమకు జరిగిన అన్యాయంపై నిరుద్యోగులు శాంతియుతంగా నిరసన తెలపడం కూడా నేరంగా పరిగణించడం దారుణమని పేర్కొన్నారు.
Nara Lokesh
Jagan
Arrest
Job Calendar
Unemployment
Vijayawada
Police
Andhra Pradesh

More Telugu News