Police: తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం దృష్ట్యా నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టు వ‌ద్ద భారీగా పోలీసుల మోహ‌రింపు

  • రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఫిర్యాదులు
  • మండిప‌డుతోన్న‌ తెలంగాణ
  • గ‌తంలో చోటు చేసుకున్న‌ ఉద్రిక్త ప‌రిస్థితుల దృష్ట్యా చ‌ర్య‌లు
police security at sagar

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఫిర్యాదులు వస్తోన్న విష‌యం తెలిసిందే.  ఏపీ చ‌ర్య‌ల వ‌ల్ల పర్యావరణ సమస్యలు వస్తాయంటూ తెలంగాణకి చెందిన  శ్రీనివాస్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కి ఫిర్యాదు చేయ‌డం, ట్రైబ్యునల్ ఆదేశాలతో కేంద్ర పర్యావరణ శాఖ ఓ కమిటీని నియమించడం వంటివి జ‌రిగాయి. ఏపీ నిర్ణ‌యాల‌పై తెలంగాణ ప్రభుత్వం కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

అయితే, దీనిపై ఏపీ ప్రభుత్వం మాత్రం నిబంధనల ప్రకారమే ప‌నులు జరుగుతున్నాయ‌ని అంటోంది. ఈ నేప‌థ్యంలో ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్త‌కుండా నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టు వ‌ద్ద భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. ప్ర‌ధాన విద్యుదుత్ప‌త్తి కేంద్రం వ‌ద్ద 100 మంది పోలీసులను మోహ‌రించారు. గ‌తంలో అక్క‌డ చోటు చేసుకున్న ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని మ‌రోసారి అలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

More Telugu News