Kalyan Dev: అవిక బర్త్ డే స్పెషల్ .. న్యూ మూవీ నుంచి ఫస్టు గ్లింప్స్!

Avika Gor First Glimpse in Sreedhar Seepaana Movie
  • యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న అవిక
  • చైతూ సరసన 'థ్యాంక్యూ'
  • కల్యాణ్ దేవ్ జోడీగా మరో సినిమా
  • దర్శకుడిగా శ్రీధర్ సీపాన 
కథనాయికగా ఆదిలోనే వరుస హిట్లు అందుకోవడం  .. యూత్ హృదయాలను దోచేయడం చాలామంది విషయంలో అంత తేలికగా జరగదు. కానీ అవిక గోర్ విషయంలో అవి అవలీలగా జరిగిపోయాయి. ముద్దుగా .. బొద్దుగా తెరపై ఈ అమ్మాయి చేసిన అల్లరికి ప్రేక్షకులు మురిసిపోయారు. వరుస విజయాలు దక్కుతూ ఉండటంతో, ఆమెకి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో అవిక ఒక్కసారిగా టాలీవుడ్ కి దూరమైంది. ఆఫర్లు వెళ్లినా అంతగా ఆసక్తి చూపలేదు. కారణాలు ఏవైనా ఇక్కడి ఆడియన్స్ తో ఆమెకి గ్యాప్ వచ్చేసింది.

మళ్లీ ఇప్పుడు ఆమె తెలుగు సినిమాలపై దృష్టి పెట్టింది. వరుసగా అవకాశాలను అందుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నాగచైతన్యతో పాటు కల్యాణ్ దేవ్ జోడీగా ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమాకి శ్రీధర్ సీపాన దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ రోజున అవిక పుట్టిన రోజు కావడంతో, ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను వదిలారు. కలర్ఫుల్ ఫ్రేమ్స్ లో అవికాను చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ వారు సమర్పిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు.
Kalyan Dev
Avika Gor
Sridhar Seepana

More Telugu News