Afghanistan: ఆఫ్ఘన్‌లోని భారత పౌరులు జాగ్రత్తగా ఉండాలి: కేంద్రం హెచ్చరిక

Centre releases safety advisory to indian nationals in Afghanistan
  • ఆఫ్ఘన్‌పై పట్టు సాధిస్తున్న తాలిబన్లు
  • పెరుగుతున్న హింసాత్మక దాడులు
  • భద్రతా నియమావళిని జారీ చేసిన భారత్  
  • విదేశీయులకు హాని ఉండదని తాలిబన్ల హామీ
  • తాలిబన్లతో రహస్యంగా చర్చలు ప్రారంభించిన భారత్‌?
ఆఫ్ఘనిస్థాన్‌ భూభాగంపై తాలిబన్లు పట్టు సాధిస్తున్న నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. ఆ దేశంలో ఉన్న భారతీయులకు 13 అంశాలతో కూడిన భద్రతా నియమావళిని జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. ఆఫ్ఝన్‌లోని ఉగ్రమూకలు హింసాత్మక దాడులను పెంచాయని.. దేశంలోని వివిధ ప్రాంతాలపై విరుచుకుపడుతున్నాయని తెలిపింది. ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. వీటికి భారతీయులు అతీతమేమీ కాదని.. ముఖ్యంగా ఇండియన్స్‌కు కిడ్నాప్‌ ముప్పు పొంచి ఉందని అప్రమత్తం చేసింది.

ఈ క్రమంలో దీనిపై స్పందించిన తాలిబన్లు.. రాయబారులు, సైనికేతర విదేశీ పౌరులు, రాయబార కార్యాలయాలు, అంతర్జాతీయ సంస్థల సిబ్బందికి ఎలాంటి హాని ఉండదని ‘ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ ఆప్ఘనిస్థాన్‌’ తరఫున హామీ ఇస్తున్నట్లు ప్రకటించింది.

మరోపక్క, క్రమంగా ఆఫ్ఘన్‌పై పట్టు సాధిస్తున్న తాలిబన్లతో భారత్‌ ఇప్పటికే రహస్యంగా చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ మేరకు దోహాలో ఉన్నత స్థాయిలో పలు దఫాలు సమావేశాలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఇవి ఇంకా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ స్థాయి వరకు రాలేదని సమాచారం.
Afghanistan
Taliban
Security threat

More Telugu News