పాలిచ్చే తల్లులు, గర్భిణులకు ఆ నాలుగు కరోనా టీకాలు సురక్షితమే: కేంద్రం
- భారత్‌లో అందుబాటులోకి వచ్చిన నాలుగు టీకాలు
- అన్నీ సురక్షితమైనవేనని కేంద్రం స్పష్టీకరణ
- సంతానోత్పత్తి సమస్యలూ ఉండవని స్పష్టం
- గర్భిణులకు కరోనా సోకితే బిడ్డపై ప్రభావం పడే అవకాశం
గర్భిణులకు టీకా ఇచ్చే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, వారికి ఇవ్వాల్సిన కౌన్సిలింగ్‌కు సంబంధించి ఆరోగ్య శాఖ ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసం ఓ గైడ్‌ను రూపొందించింది. ఇప్పటివరకు కరోనా సోకిన గర్భిణుల్లో 90 శాతం మంది కోలుకున్నారు. అయితే, కొంత మందిలో ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తితే అది కడుపులో ఉన్న బిడ్డపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గర్భిణులు కూడా టీకా తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.