14 ఏళ్లకే తల్లయిన అమ్మాయి... ఎమ్మెల్యే సీతక్క ఎలా స్పందించారో ఈ వీడియోలో చూడండి!

29-06-2021 Tue 19:53
  • మారుమూల తండాలో సీతక్క పర్యటన
  • ఓ పాఠశాలలో చిన్నారులతో ఆటపాటలు
  • వారికి తినుబండారాలు, ఆటవస్తువులు అందజేత
  • చంటిబిడ్డను ఎత్తుకున్న అమ్మాయిని చూసి ఆశ్చర్యం
MLA Seethakka responds after seeing a girl with child
ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క ఎంతో విలక్షణమైన నేత. రాజకీయ నేత అయినప్పటికీ ఎంతో నిరాడంబరంగా ఉంటారు. నిత్యం ప్రజల మధ్యనే ఉండేందుకు ఇష్టపడతారు. తాజాగా సీతక్క తన నియోజకవర్గంలోని ఓ మారుమూల తండాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి పాఠశాలలో చిన్నారులకు తినుబండారాలు, ఆట వస్తువులు అందించారు. ఇక, అక్కడే ఓ బాలిక చంకలో పసిబిడ్డను ఎత్తుకుని కనిపించడంతో సీతక్క ఆశ్చర్యపోయారు. ఆ బాలికను ఎంత వయసు అని అడిగారు.

ఆ అమ్మాయి 14 ఏళ్లు అని చెప్పడంతో... "ఇంత చిన్నవయసులోనే తల్లయ్యావా? ఆరోగ్యం ఎలా ఉంటోంది? నువ్వు బాగా చదువుకుని ఉండుంటే ఇక్కడి స్కూల్లో నిన్నే టీచర్ గా నియమించేదాన్ని కదా. చిన్నవయసులోనే పెళ్లిళ్లు చేసుకోవద్దు" అంటూ హితబోధ చేశారు. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో సందడి చేస్తోంది.