Shivakarthikeyan: ఓటీటీ వైపే అడుగేసిన 'డాక్టర్'

Doctor is going to release in Hotstar
  • శివకార్తికేయన్ హీరోగా 'డాక్టర్'
  • ఆయన జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్
  • దర్శకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్
  • హాట్ స్టార్ చేతికి రిలీజ్ పగ్గాలు    
ఇటు దక్షిణాదిలోను .. అటు ఉత్తరాదిలోను కరోనా కారణంగా చాలా సినిమాల విడుదలలు ఆగిపోయాయి. కరోనా ప్రభావం తగ్గిన తరువాత థియేటర్లలోనే తమ సినిమాను విడుదల చేద్దామని అనుకునే నిర్మాతలు కొందరైతే, అసలు ఎప్పుడు థియేటర్లు తెరుచుకుంటాయో క్లారిటీ లేనప్పుడు ఎదురుచూడటంలో అర్థం లేదని మరికొందరు భావిస్తున్నారు. ఓ మాదిరి బడ్జెట్ తో రూపొందిన సినిమాలు మాత్రం ఓటీటీ గొడుగు క్రిందికే చేరుతున్నాయి. మంచి ఆఫర్ వస్తే ఆ ఫ్లాట్ ఫామ్ పై పరుగులు పెట్టడానికి ఎంతమాత్రం ఆలోచించడం లేదు.

అలా తాజాగా తమిళ సినిమా 'డాక్టర్' కూడా ఓటీటీ బాట పట్టింది. శివకార్తికేయన్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను రూపొందించాడు. ప్రస్తుతం ఆయన విజయ్ హీరోగా 'బీస్ట్' చేస్తున్నాడు. అందువలన 'డాక్టర్'పై అందరిలోనూ ఆసక్తి ఉంది. హాట్ స్టార్ వారు మంచి రేటుకు ఈ సినిమాను తీసుకున్నారు. ఈ సినిమాను ఎప్పుడు లైన్లో పెట్టేది త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది. తెలుగులోను ఈ అమ్మాయికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సుందరి కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.
Shivakarthikeyan
Priyanka Arul Mohan
Doctor Movie

More Telugu News