Williamson: కోహ్లీని ఆలింగనం చేసుకోవడానికి కారణం ఇదే: న్యూజిలాండ్ కెప్టెన్ విలియంసన్

Kohli is my best friend says Williamson
  • కోహ్లీ, నేను సుదీర్ఘ కాలంగా మిత్రులం
  • మంచి స్నేహితుడు కావడం వల్లే హగ్ చేసుకున్నాం  
  • టీమిండియా అత్యంత బలమైన జట్టు
ఇంగ్లండ్ లో జరిగిన టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో ఇండియాపై న్యూజిలాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయాలు కలగడంతో... చివరకు మ్యాచ్ రిజర్వ్ డేకు చేరుకుంది. చివరకు న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. విన్నింగ్ షాట్ ను కొట్టిన రాస్ టేలర్ ను కివీస్ కెప్టెన్ విలియంసన్ అభినందించాడు. అంతేకాదు నేరుగా కోహ్లీ వద్దకు వచ్చి హగ్ చేసుకున్నాడు. ఇది క్రికెట్ అభిమానుల దృష్టిని అమితంగా ఆకర్షించింది.

దీనిపై విలియంసన్ వివరణ ఇస్తూ, కోహ్లీ, తాను సుదీర్ఘ కాలంగా మిత్రులమని చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో సన్నిహిత సంబంధాలు ఉండటం సహజమేనని అన్నాడు. కోహ్లీ నాకు మంచి మిత్రుడు కావడం వల్లే మ్యాచ్ ముగిసిన అనంతరం అతనిని ఆలింగనం చేసుకున్నానని చెప్పాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని కలిసే అవకాశాన్ని క్రీడలు కల్పిస్తాయని అన్నాడు. కలసి ఆడుతున్నప్పుడు కానీ, ఎదురెదురుగా పోటీపడుతున్నప్పుడు కానీ విభిన్నమైన అనుభవాలు ఎదురవుతాయని చెప్పాడు. కొన్నిసార్లు ఆసక్తులు, ఇష్టాలు, అయిష్టాలు కూడా ఒకేలా ఉంటాయని అన్నాడు. టెస్ట్ ఫైనల్స్ లో ఇండియా ఓడిపోయినంత మాత్రాన ఆ జట్టును తక్కువగా అంచనా వేయకూడదని చెప్పాడు. టీమిండియా అత్యంత బలమైన జట్టు అని అన్నాడు.
Williamson
Team New Zealand
Virat Kohli
Team India

More Telugu News