Chiranjeevi: చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం లేదు: ఊమెన్ చాందీ

  • విజయవాడలో నిన్న ఏపీ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం
  • చిరంజీవి ఇప్పుడు కాంగ్రెస్ నేత కాదన్న చాందీ
  • కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు ఆయన హాజరు కావడం లేదన్న నేత
Oommen Chandy shocking comments on Chiranjeevi with reference to Congress party

గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న టాలీవుడ్ ప్రముఖ నటుడు చిరంజీవిపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ ఊమెన్ చాందీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగడం లేదని అన్నారు. విజయవాడలో నిన్న నిర్వహించిన ఏపీ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి ఇప్పుడు కాంగ్రెస్ నేత కాదన్నారు. ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదన్నారు. కాగా, తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి (స్వతంత్ర హోదా)గా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు.

More Telugu News