Chandrababu: మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో నేడు చంద్రబాబు దీక్ష

Chandrababu protest today at Mangalagiri NTR Bhavan
  • పది డిమాండ్లతో నేడు రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు
  • 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌ల దీక్ష
  • కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహణ
కరోనా వల్ల నష్టపోయిన వారిని ఆర్థికంగా ఆదుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ నేడు ఏపీ వ్యాప్తంగా దీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం (ఎన్టీఆర్ భవన్)లో దీక్ష చేయనున్నారు. అలాగే, 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నేతలు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా దీక్షలో పాల్గొంటారు.

మిగిలిన నేతలు ఎవరి నియోజకవర్గాల్లో వారు దీక్షల్లో పాల్గొంటారు. రేషన్ కార్డుదారులకు రూ. 10 వేలు, కరోనా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇవ్వాలన్న డిమాండ్‌తో మొత్తం 10 డిమాండ్లతో టీడీపీ ఈ దీక్షలు చేపట్టింది.
Chandrababu
Mangalagiri
TDP

More Telugu News