Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Samantas Shakuntalam latest schedule started in Hyderabad
  • మొదలైన 'శాకుంతలం' షెడ్యూలు 
  • పవన్ సినిమాలో మరోసారి ప్రకాశ్ రాజ్
  • 'లూసిఫర్' రీమేక్ కి మ్యూజిక్ సిటింగ్స్  
*  ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'శాకుంతలం' చిత్రం తాజా షెడ్యూలు షూటింగు నిన్నటి నుంచి తిరిగి హైదరాబాదులో జరుగుతోంది. ఈ పురాణకథలో శకుంతలగా అందాలతార సమంత నటిస్తున్న సంగతి విదితమే.
*  పవన్ కల్యాణ్ సినిమాలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి నటించనున్నాడు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ హీరోగా రూపొందే సినిమాలో ప్రధాన విలన్ గా ప్రకాశ్ రాజ్ నటించనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వీరిద్దరూ కలసి 'వకీల్ సాబ్' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
*  ప్రస్తుతం చేస్తున్న 'ఆచార్య' సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ లో నటించనున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ ప్రస్తుతం సంగీత దర్శకుడు తమన్ నేతృత్వంలో జరుగుతున్నాయి.
Samantha
Pawan Kalyan
Prakash Raj
Chiranjeevi

More Telugu News