KTR: కేసీఆర్ మనవడు హిమాన్షుకు అరుదైన గౌరవం!

KCRs Grandson Receives Diana Award
  • హిమాన్షును వరించిన ప్రతిష్ఠాత్మక డయానా అవార్డు
  • షోమా పేరుతో ఇటీవల ఓ వీడియో రూపొందించిన హిమాన్షు
  • చిన్న వయసులోనే సామాజిక సేవ చేస్తున్నందుకు గాను అవార్డు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు ప్రతిష్ఠాత్మక డయానా అవార్డు అందుకున్నారు. ఆహార కల్తీపై అవగాహన కల్పించడంతోపాటు కల్తీలేని ఆహారాన్ని ఉత్పత్తి చేసేలా గ్రామీణుల్ని చైతన్యవంతుల్ని చేయడం, గ్రామాలు స్వయం సమృద్ధి సాధించడం ఎలానో వివరిస్తూ హిమాన్షు ఇటీవల ‘షోమా’ పేరుతో ఓ వీడియో రూపొందించారు. ఈ వీడియోను పరిశీలించిన డయానా ఆర్గనైజేషన్ హిమాన్షుకు అవార్డును ప్రకటించింది.

దివంగత బ్రిటన్ యువరాణి డయానా జ్ఞాపకార్థం చిన్న వయసులోనే సమాజానికి సేవ చేస్తున్న 9-25 ఏళ్ల మధ్య వారికి ఈ అవార్డును ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఈ అవార్డు హిమాన్షును వరించింది. తనకు అవార్డు వచ్చిన విషయాన్ని హిమాన్షు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.
KTR
KCR
Himanshu Rao Kalvakuntla
Diana Award

More Telugu News