Corona Virus: కరోనా వ్యాక్సిన్లపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్ అనుమానాలు.. కొట్టిపారేసిన కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌

  • టీకా భద్రత, సామర్థ్యంపై అనుమానాలు
  • యువకులకు కరోనా కంటే టీకా వల్లే ముప్పు
  • కరోనా సోకిన వారిలో టీకా కంటే ఎక్కువ ఇమ్యూనిటీ
  • కరోనా టీకాలపై ప్రశాంత్‌ భూషణ్‌ అనుమానాలు
  • తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎన్‌.కె.అరోరా
Prashant Bhushan raises doubts on vaccine nk arora refutes

కరోనా వ్యాక్సిన్‌ సామర్థ్యం, భద్రతపై అనుమానాలు లేవనెత్తుతూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన వ్యాఖ్యల పట్ల కేంద్ర ప్రభుత్వ కొవిడ్‌ కార్యాచరణ బృందం ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.కె.అరోరా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాక్సిన్లపై ప్రజల్లో నెలకొన్న ఆందోళనలు తొలగించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న సమయంలో ప్రశాంత్‌ భూషణ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు.

వ్యాక్సిన్‌ వల్ల తన భార్య చనిపోయిందంటూ ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేసిన వార్తను ఓ పత్రిక ప్రచురించింది. దాన్ని ఉటంకిస్తూ ప్రశాంత్‌ భూషణ్‌ ట్విట్టర్‌ వేదికగా టీకా భద్రత, సామర్థ్యంపై అనేక అనుమానాలు లేవనెత్తారు. యువకులకు కరోనా కంటే వ్యాక్సిన్‌ వల్లే అధిక ముప్పని ఆరోపించారు. అలాగే వ్యాక్సిన్‌ వల్ల ఏర్పడే రోగనిరోధకత కంటే ఎక్కువ రోగ నిరోధకత కరోనా సోకిన వారిలో ఉంటోందని వ్యాఖ్యానించారు. తాను వ్యాక్సిన్లకు వ్యతిరేకం కాకపోయినప్పటికీ.. ప్రయోగాత్మక దశలో ఉన్న టీకాలను ఇవ్వడం బాధ్యతారాహిత్యమని అన్నారు. పైగా యువకులు, కొవిడ్ నుంచి కోలుకున్నవారిపై టీకాను పరీక్షించలేదన్నారు.

More Telugu News