Covishield: కొవిషీల్డ్ టీకాలు తీసుకున్నవారిని అడ్డుకుంటున్న యూరప్ దేశాలు... పూనావాలా స్పందన

Europe nations restricts who has taken Covishield vaccine
  • ఈయూ దేశాల్లో గ్రీన్ పాస్
  • గ్రీన్ పాస్ జాబితాలో పలు టీకాలు
  • ఆ టీకాలు తీసుకున్నవారికే తమ దేశాల్లోకి అనుమతి
  • ఇటీవలే గ్రీన్ పాస్ లిస్టు నుంచి కొవిషీల్డ్ తొలగింపు
భారత్ లో తయారైన కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రపంచదేశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిదేశాలు తమ భూభాగంలోకి ప్రవేశాన్ని నిరాకరిస్తున్నాయి. భారత్ లో తయారైన కొవిషీల్డ్ తీసుకుని యూరప్ వెళుతున్నవారికి అక్కడి దేశాలు గ్రీన్ పాస్ రూపంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గ్రీన్ పాస్ జాబితాలో లేని టీకాలు తీసుకున్నవారిని యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు అనుమతించడంలేదు.

పూణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఇటీవలే ఈయూ గ్రీన్ పాస్ జాబితా నుంచి తొలగించింది. మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, వాక్స్ జెర్విరా, ఫైజర్ టీకాలకు మాత్రమే గ్రీన్ పాస్ జాబితాలో చోటుంది. ఈ టీకాలను తీసుకుంటే ఈయూ దేశాల్లోకి నిరభ్యంతరంగా అడుగుపెట్టే వీలుంది. తాజాగా, కొవిషీల్డ్ తీసుకున్న భారతీయులకు యూరప్ దేశాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల పట్ల సీరం ఇన్ స్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలా స్పందించారు.

కొవిషీల్డ్ తీసుకున్న భారతీయుల్లో చాలామంది యూరప్ వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే సమస్య పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తానని పూనావాలా హామీ ఇచ్చారు. ఔషధ నియంత్రణ సంస్థలతోనూ చర్చించడమే కాకుండా, దౌత్యమార్గాల్లోనూ అనుమతుల కోసం చర్యలు తీసుకుంటామని వివరించారు.
Covishield
Europe
EU
Green Pass
India
Serum Institute
Adar Poonawalla

More Telugu News