Congress: కాంగ్రెస్‌ సహితంగానే జాతీయ కూటమి: తేజస్వీ యాదవ్‌

  • అది సహజమన్న యువనేత
  • దేశవ్యాప్తంగా ఉనికి ఉన్న పార్టీ అని వ్యాఖ్య
  • 200 స్థానాల్లో బీజేపీతో ప్రత్యక్ష పోరు
  • మిగిలిన చోట్ల ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం
  • ఎన్డీయే ప్రభుత్వం నియంతృత్వ సర్కార్‌
  • ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ కీలక వ్యాఖ్యలు
for Any National Coalition Against BJP Congress Should Be Fulcrum Says Tejashwi Yadav

కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా ఉనికి కలిగిన జాతీయ పార్టీ అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ అన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ స్ఠాయిలో ఎన్‌డీఏకి వ్యతిరేకంగా ఏదైనా కూటమి ఏర్పాటైతే అది కాంగ్రెస్‌ సహితంగానే ఉండడం సహజమని అభిప్రాయపడ్డారు.

దేశంలో దాదాపు 200 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ ప్రత్యక్షంగా పోటీ పడతాయని తేజస్వీ యాదవ్‌ తెలిపారు. ఆ స్థానాలపై కాంగ్రెస్‌ దృష్టి సారించి మిగిలిన సీట్లలో ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నివాసంలో ఇటీవల జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఏం నిర్ణయించారో తనకు తెలియదన్నారు.

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వాన్ని ఫాసిస్టు, నియంతృత్వ, విభజనవాద, అణచివేసే సర్కార్‌గా తేజస్వీ యాదవ్‌ అభివర్ణించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఓడించేందుకు కనీస ఉమ్మడి ప్రణాళికతో పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశం కలిసికట్టుగా ఉంటుందో లేక విభజనకు గురవుతుందో ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయని తమ నాయకుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ 2014 ఎన్నికల సందర్భంగా అన్నారని.. ఇప్పుడు ఆయన మాటలే నిజమవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

More Telugu News