Marri Sasidhar Reddy: టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన మర్రి శశిధర్ రెడ్డి

Marri Sasidhar Reddy quits as TPCC Election Coordination Committee Chairman
  • తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి
  • పార్టీకి రాజీనామా చేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
  • తాను కాంగ్రెస్ లోనే ఉంటానన్న మర్రి
  • పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని వెల్లడి
  • సోనియా గాంధీకి రాజీనామా లేఖ
మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తాజాగా, కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపించారు. నూతన సమన్వయ కమిటీ ఏర్పాటులో టీపీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పూర్తిగా సహకరిస్తామని శశిధర్ రెడ్డి తెలిపారు. ఏది ఎలాగున్నా కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలే తనకు ముఖ్యమని, ఎప్పటికీ కాంగ్రెస్ వాదిగానే ఉంటానని ఉద్ఘాటించారు.

కాగా, రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇవ్వడంతో కాంగ్రెస్ సీనియర్లు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించే సాహసం చేయనప్పటికీ, తమ అసంతృప్తిని మాత్రం ఏదో ఒక రూపంలో వెళ్లగక్కుతున్నారు.
Marri Sasidhar Reddy
TPCC Election Coordination Committee
Chairman
Resignation
Revanth Reddy
TPCC President
Congress
Telangana

More Telugu News