Ram Nath Kovind: హెలికాప్టర్ దిగగానే సొంతగడ్డకు ప్రణమిల్లిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

  • మూడ్రోజుల పర్యటనకు కాన్పూర్ వెళ్లిన రాష్ట్రపతి
  • జన్మస్థలం పరౌంఖ్ గ్రామానికి హెలికాప్టర్ లో పయనం
  • స్థానిక పత్రి మాతా ఆలయంలో పూజలు
  • గ్రామస్తులతో మాటామంతీ
Ramnath Kovind bows down to his native place

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చాన్నాళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్ లోని తన సొంతగడ్డపై అడుగుపెట్టారు. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ స్టేషన్ నుంచి ప్రత్యేక రైలులో కాన్పూర్ చేరుకున్న ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్ లో తన జన్మస్థలం పరౌంఖ్ గ్రామానికి తరలి వెళ్లారు. హెలికాప్టర్ దిగగానే తీవ్ర భావోద్వేగాలకు లోనైన కోవింద్ నేలతల్లికి ప్రణామం చేశారు.

ఆపై కుటుంబ సమేతంగా స్థానికంగా పత్రి మాతా ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు ఆచరించిన అనంతరం, గ్రామస్తులతో మాట్లాడారు. కాగా, రాష్ట్రపతి నేలతల్లికి నమస్కరిస్తున్న దృశ్యాలను రాష్ట్రపతిభవన్ సోషల్ మీడియాలో పంచుకుంది. కాన్పూర్ పరిసర ప్రాంతాల్లో రాష్ట్రపతి పర్యటన మూడ్రోజులు సాగనుంది.

More Telugu News