Jagan: ఈ నెల 29న దిశ యాప్ డౌన్ లోడ్ కార్యక్రమంలో పాల్గొంటున్న సీఎం జగన్

CM Jagan attends to Disha App download program
  • మహిళల భద్రత కోసం దిశ యాప్
  • ఇటీవల ప్రకాశం బ్యారేజి ఘటన
  • అప్రమత్తమైన ప్రభుత్వం
  • ప్రతి మహిళ ఫోన్లో దిశ యాప్ ఉండేలా చర్యలు
ఇటీవల ప్రకాశం బ్యారేజి వద్ద ఘోర అత్యాచార ఘటన జరిగిన నేపథ్యంలో, మహిళల ఫోన్లలో దిశ యాప్ డౌన్ లోడ్ చేయించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. దిశ యాప్ వినియోగంపై చైతన్యం, అవగాహన కలిగించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో పోలీసులు తమ పరిధిలో అనేకమంది మహిళల ఫోన్లలో దిశ యాప్ డౌన్ లోడ్ చేయిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో సీఎం జగన్ కూడా పాల్గొననున్నారు. ఎల్లుండి విజయవాడ గొల్లపూడిలో జరిగే దిశ యాప్ డౌన్ లోడ్ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరు కానున్నారు. మహిళల భద్రత కోసం దిశ యాప్ తీసుకువచ్చిన సర్కారు, ప్రతి మహిళ ఫోన్ లోనూ దిశ యాప్ ఉండేలా శ్రమిస్తోంది.
Jagan
Disha App
Download Program
Gollapudi
Vijayawada

More Telugu News