Hyderabad: హైదరాబాదులో మారిన వాతావరణం... పలు ప్రాంతాల్లో భారీ వర్షం

Hyderabad weather turns into heavy rain
  • హైదరాబాదులో మారిన వాతావరణం
  • భారీ వర్షపాతం నమోదు
  • కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం
  • రేపు కూడా వర్షాలు పడతాయన్న వాతావరణ కేంద్రం
నైరుతి రుతుపవనాలు మందగించడంతో, పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా ఇబ్బందిపడిన నగర జీవికి ఉపశమనం కలిగింది. ఈ మధ్యాహ్నం తర్వాత హైదరాబాదులో భారీ వర్షం కురిసింది. అమీర్ పేట్, పంజాగుట్ట, కోఠి, అబిడ్స్, లక్డీకాపూల్, సుల్తాన్ బజార్, బేగంబజార్,  ఖైరతాబాద్, నారాయణగూడ, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.

వనస్థలిపురం, అబ్దుల్లాపూర్ మెట్, నాగోల్, హయత్ నగర్, ఎల్బీనగర్, మన్సూరాబాద్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురవగా, గచ్చీబౌలి, మియాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. కాగా, తెలంగాణలో రేపు కూడా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
Hyderabad
Rains
Weather
Telangana

More Telugu News