Shankar: క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో దర్శకుడు శంకర్ కుమార్తె వివాహం... ఫొటోలు ఇవిగో!

Shankar daughter Aishwarya ties the knot with cricketer Rohit Damodaran
  • నేడు ఐశ్వర్య, రోహిత్ ల వివాహం
  • చెన్నైలో ఘనంగా జరిగిన పరిణయం
  • విచ్చేసిన సీఎం స్టాలిన్
  • వధూవరులకు ఆశీర్వాదాలు
ప్రముఖ దక్షిణాది దర్శకుడు శంకర్ కుమార్తె ఐశ్వర్య వివాహం తమిళనాడు క్రికెట్ ఆటగాడు రోహిత్ దామోదరన్ తో నేడు ఘనంగా జరిగింది. చెన్నైలో ఇరు కుటుంబాల వారు, వారి సన్నిహితుల నడుమ ఈ పరిణయం జరిగింది. ఈ సెలబ్రిటీ వివాహ మహోత్సవానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆరోగ్యమంత్రి సుబ్రమణియన్, స్టాలిన్ తనయుడు, చేపాక్ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ కూడా విచ్చేశారు. సీఎం స్టాలిన్ వధూవరులను ఆశీర్వదించారు.

శంకర్ కుమార్తె ఐశ్వర్య వైద్యురాలు కాగా, రోహిత్ దామోదరన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్ పీఎల్)లో మధురై పాంథర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రోహిత్ తండ్రి దామోదరన్ మధురై జట్టుకు యజమాని. ఆయన తమిళనాడులో ప్రముఖ పారిశ్రామికవేత్త. ఐశ్వర్య, రోహిత్ దామోదరన్ ల పెళ్లికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.
Shankar
Director
Aishwarya Shankar
Rohit Damodaran
Wedding
Chennai
Stalin
Tamilnadu

More Telugu News